Balineni: హాట్‌టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కామెంట్స్

Balineni: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న బాలినేని

Update: 2023-12-11 04:00 GMT

Balineni: హాట్‌టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కామెంట్స్

Balineni: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పందెం కాసినట్లు చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

నవంబర్ 30న తెలంగాణలో జరిగిన ఎన్నికలపై బెట్టింగ్ వేశానని ఆయన తెలిపారు. స్నేహితులు వేసిన బెట్టింగ్‌లో తాను కూడా సరదాగా పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని, తన కుమారుడు అనుకున్నాడని బాలినేని చెప్పారు. కానీ ఈ సారి ఎన్నికలు అంత ఈజీ కాదని.. విభిన్నంగా ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఒక్కటే పని చేయదని, చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. తాను మాత్రం ఒంగోలు నుంచే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తనపై, తన కుమారుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్ని్కల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలుసన్న బాలినేని.. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ గెలవాలని ఆశపడినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గెలుస్తుందని తనతో చెప్పినట్లు బాలినేని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అంశం వ్యవహారంలో తన మిత్రులు సరదాగా పందెంలో పాల్గొంటే తాను కూడా పాల్గొన్నానని తెలిపారు. అయితే బీఆర్ఎస్ గెలుస్తుందని తన కుమారుడు చెప్పడంతో పందెం నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. దీంతో తన కొడుకు బాధపడకూడదని, కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినప్పటికీ కూడా పందెం వెనక్కి తీసుకున్నట్లు వివరించారు.

మరో వైపు హైదరాబాద్‌లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు ఎమ్మెల్యే బాలినేని. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే మాత్రం.. టీడీపీ వాళ్లు తమ గొప్పేనంటూ ప్రచారం చేసుకుని ఉండేవారని విమర్శలు చేశారు. గతంలోనూ తాను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల కోసం ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకున్నప్పుడు కూడా.. డబ్బులు తీసుకునే ప్రజలకు పనులు చేస్తానంటూ తన మాటలను వక్రీకరించారన్నారు బాలినేని. అయితే ఎన్నికల పోటీలో భాగంగా అప్పులు చేసి ఖర్చు పెట్టినట్లు తెలిపారు. అప్పులు ఇచ్చినవారిలో టీడీపీ వాళ్లూ ఉన్నారన్నారు బాలినేని.

Tags:    

Similar News