వారికోసం మిగిలిన ప్రాంతాలను విస్మరించాలా?: వైసీపీ నేత రవిచంద్రారెడ్డి

ఏపీకి మూడు రాజధానులు ఉంటాయేమో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

Update: 2019-12-18 06:46 GMT
కనుమూరు రవిచంద్రారెడ్డి

ఏపీకి మూడు రాజధానులు ఉంటాయేమో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీంతో జగన్ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలను వైసీపీ సమర్ధిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో సీఎం వ్యాఖ్యలు సంతోషం కలిగిస్తున్నాయని అన్నారు. అమరావతిలో కొందరు టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజల సొమ్మును ఖర్చు చెయ్యాలా? అని ప్రశ్నించారు.

టీడీపీ సానుభూతిపరులకోసం మిగిలిన ప్రాంతాలను విస్మరించాలా? అని అన్నారు. ఈరోజుటికి కూటికి, గుడ్డకు రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే కారణం చంద్రబాబు నిర్ణయాలేనని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లకు మాత్రం అభివృద్ధి చెందాలనే ఆశ ఉండదా? అని అన్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించాలంటే తక్కువలో తక్కువ 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అది కూడా గుంటూరు, విజయవాడ లాంటి నగరంలా ఉంటుందని.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం ఇది సాధ్యం కాదు.. కాబట్టి అప్పు తీసుకురావాలి.

ఒక ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించడంకోసం ఎక్కడో శ్రీకాకుళం, అనంతపురం లాంటి ప్రాంతాల వారి నెత్తిమీద అప్పు భారం వెయ్యడం కరెక్ట్ కాదని రవిచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అంతా జరిగితే వారంతా వచ్చి అమరావతి ప్రాంతంలో ఉంటారా? కాబట్టి రాజధాని వికేంద్రీకరణ (డిసెంట్రలైజషన్)జరగాలి.. రాజధానిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకు విస్తరింపజెయ్యాలి. అప్పుడే అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని రవిచంద్రారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News