వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

నేడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ నేతలు

Update: 2019-11-01 07:46 GMT

నేడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ నేతలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వేడుకలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటురు జిల్లా తాడేపల్లి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌, నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌ రెడ్డి, అధికార ప్రతినిధులు కొండా రాజీవ్ గాంధీ, నాగార్జున యాదవ్, పద్మజారెడ్డి అలాగే పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News