Gudivada: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడలో పొలిటికల్ హీట్
Gudivada: సాయంత్రం గుడివాడలో చంద్రబాబు రా.. కదలిరా..! సభ
Gudivada: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడలో పొలిటికల్ హీట్
Gudivada: ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష పోటాపోటీ కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి వెళ్లారు. అనంతరం టీడీపీ ఇన్‌చార్జ్ వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టారు. మరో వైపు ఎన్టీఆర్ విగ్రహం పక్కనే మాజీ మంత్రి కొడాలి నాని అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.