కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావు

మచిలీపట్నంలోని వై .ఎస్.ఆర్ సహకార భవన్ లో వేదమంత్రాలతో శాస్రోత్తంగా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదవీ బాధ్యతలను వెంకట్రావు స్వీకరించారు.

Update: 2019-12-14 06:05 GMT
యార్లగడ్డ వెంకట్రావు

మచిలీపట్నం: మచిలీపట్నంలోని వై .ఎస్.ఆర్ సహకార భవన్ లో వేదమంత్రాలతో శాస్రోత్తంగా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదవీ బాధ్యతలను వెంకట్రావు స్వీకరించారు. సహకార సారధి చైర్మన్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజజకవర్గం ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావును ప్రభుత్వం నియ మించింది యార్లగడ్డ గతంలో 2014,2019 గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరుపున బరిలో నిలిచారు...బాధ్యతల స్వీకరణ అనంతరం బోర్డ్ సమావేశం నిర్వహించిన యార్లగడ్..

చైర్మన్ వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ...కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్న బోర్డు సభ్యులు, బ్యాంక్ అధికారులంతా తన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది చైర్మన్ లు పని చేసారు. నా తర్వాత కూడా చేస్తారు నా హయాంలో కెడీసీసీబీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఉండేలా సేవలందిస్తాన్నారు.

కెడీసీసీబీ ద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున రుణ సదుపాయం కల్పిస్తా, అక్రమార్కులపై సహకార చట్టం ప్రకారం జిల్లా సహకార అధికారి విచారణ జరుగు తుంది ...అవినీతి ఆరోణలు ఉన్న ఎవరినయినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన రుణాలు రికవరి చేస్తామని స్పష్టంచేశారు.చైర్మన్ తో పాటు ఒక్కో బ్యాంకుకు ఆరుగురు పెర్సొన్ ఇంచార్జి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది...ప్రాధమిక సహకార సంఘాల గడువు జులై నెలాఖ రుతో ముగియగా కె .డి .సి.సి.బి పాలక వర్గానికి ఆగష్టు 4వతేదీతోనూ, డి.సీఎం.ఎస్ పాలక వర్గానికి ఆగష్టు 14 వ తేదీతోనూ ముగిసింది...

జిల్లాలో 425 పి .ఎ .సి.ఎస్ లలో పదవీకాలం ముగిసిన 400 సంఘాలకు ఆగష్టు మొదటి వారంలోనే త్రిమన్ కమిటీలను నియమించింది...ఇక కే.డి సి.సి.బి కి కలెక్టర్ ఎ .ఎండి.ఇంతియాజ్ , డి.సి.ఎం.ఎస్ కు జాయింట్ కలెక్టర్ కె . మాధవిలత పర్సన్ ఇంచార్జీలు గా నియమించింది ...ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహించే వరకు కె.డి.సి.సి. బి , డి.సి.ఎం.ఎస్.లకు పర్సన్ ఇంచార్జ్ కమిటి లను నియమిస్తూ ఉత్తర్యులు ప్రభుత్వం జారీ చేసింది.


Tags:    

Similar News