Srisailam: శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలో యువతి ఆత్మహత్యాయత్నం
Srisailam: పురుగుల మందుతాగి సూసైడ్ అటెంప్ట్
Representational Image
Srisailam: శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలో యువతి పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందుతాగి పడిపోయిన యువతిని చూసిన భక్తులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నం చేసిన యువతి హైదరాబాద్ కు చెందిన యువతిగా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం.