క్షణికావేశం: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకబోయిన యువతి.. కాపాడిన సిబ్బంది..!

ఇంజినీరింగ్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. వెంటనే ఆమెను కాలేజీ సిబ్బంది ఒకరు వెనక్కి లాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

Update: 2019-08-23 10:11 GMT

ఇంజినీరింగ్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. వెంటనే ఆమెను కాలేజీ సిబ్బంది ఒకరు వెనక్కి లాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ శివ, నల్గొండ జిల్లా చిలుకూరుకు చెందిన అనసూయను ప్ర్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల భార్య, భర్త మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. గురువారం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీకి భార్య వచ్చింది. భర్తను చూడాలని కోరగా, కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అనసూయ ఇంజినీరింగ్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కింది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి ఆమె దూకుతుండగా వెనుక నుంచి వచ్చిన కాలేజీ సిబ్బంది ఒకరు వెంటనే ఆమెను వెనక్కి లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

  Full View

Tags:    

Similar News