Kidnap: అడ్డొచ్చిన తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌..

Kidnap: సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు

Update: 2022-12-20 07:17 GMT

Kidnap: అడ్డొచ్చిన తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌..

Kidnap: తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతి శాలిని తన తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసింది. ఆ తర్వాత శాలిని ఆలయం నుంచి బయటకు వస్తుండగా..అప్పటికే కారులో కాపు కాసిన నలుగురు యువకులు..ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. అక్కడే ఉన్న యువతి తండ్రి..తన కూతురిని కాపాడుకునేందుకు కొంతదూరం కారును వెంబడించగా అతడిని పక్కకు నెట్టేసి..కారును వేగంగా ముందుకుపోనిచ్చారు. సీసీ కెమెరాల్లో యువతి కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే యువతి కిడ్నాప్‌ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తమ కూతురిని పోలీసులే కాపాడాలంటూ యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిని కిడ్నాప్ చేసింది ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు. గతంలో తనతో వివాహం చేసుకున్న ప్రియురాలు..నిన్న మరో యువకుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ప్రియుడే..ఇవాళ శాలినీని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News