కృష్ణా జిల్లాలో దారుణం

ఓ చోట రోడ్డుపైనే మహిళ ప్రసవించింది మరోచోట 108 వాహనం రాకపోవడంతో మరో మహిళ ఇంట్లోనే ప్రసవించింది. రోడ్డుపై ప్రసవించిన మహిళను 108లో ఆసుపత్రికి తరలించగా ఇంట్లో ప్రసవించిన మహిళకు తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉంది.

Update: 2019-08-27 11:00 GMT

ఓ చోట రోడ్డుపైనే మహిళ ప్రసవించింది మరోచోట 108 వాహనం రాకపోవడంతో మరో మహిళ ఇంట్లోనే ప్రసవించింది. రోడ్డుపై ప్రసవించిన మహిళను 108లో ఆసుపత్రికి తరలించగా ఇంట్లో ప్రసవించిన మహిళకు తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఈ రెండు ఘటనలు స్థానికులను కలిచివేశాయి.

ఉంగుటూరు మండలం కొయ్యగూరప్పాడుకు చెందిన ఇట్ల సంధ్య గన్నవరం ప్రభుత్వం ఆసుపత్రిలో డెలివరీ కోసం సర్వీస్ ఆటోలో బయలుదేరింది. హస్పిటల్ వరకు వెళ్లనని ఆటో డ్రైవర్ దారిలో దింపేశాడు. దీంతో గన్నవరం సెంటర్ నుండి నడుచుకుంటూ ఆసుపత్రికి ఆమె భర్తతో కలిసి వెలుతోంది. కొంత దూరం వెళ్లాక నొప్పులు తీవ్ర కావడంతో నడిరోడ్డుపై గర్బిణి కుప్పకూలింది. రోడ్డు పక్కన ఉన్న మొబైల్ గొడుగుల చాటున పండంటి ఆడ పిల్లను ప్రసవించింది సంధ్య. 108లో తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉంది.

మరో ఘటనలో 108 వాహనం రాకపోవడంతో ఓ మహిళ ఇంట్లోనే ప్రసవించింది. కేసరపల్లి గ్రామానికి చెందిన సంధ్య తీవ్ర నొప్పులు రావడంతో 108కి కాల్ చేశారు. ఎంత సేపటికి 108 రాకపోవడంతో చుట్టుపక్కల వారి సహకారంతో ఇంట్లోనే మహిళ మగబిడ్డను ప్రసవించింది. సరైన రీతిలో ప్రసవం కాకపోవడంతో తీవ్ర రక్తస్రావానికి గురైంది. ప్రైవేటు కారులో ఆమెను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ లేరంటూ నర్సులే ట్రీట్‌మెంట్ చేశారు. తల్లి బిడ్డల పరిస్థితి మిషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

Full View 

Tags:    

Similar News