కడప జిల్లా జమ్మలమడుగులో మహిళ ఆత్మహత్యాయత్యం
కడప జిల్లా జమ్మలమడుగులో మహిళ ఆత్మహత్యాయత్యం మోరగుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీపర్‌గా పని చేస్తున్న సుజాత సెలవుల విషయంలో డాక్టర్ తస్మయ, సుజాతకు గొడవలు
కడప జిల్లా జమ్మలమడుగులో మహిళ ఆత్మహత్యాయత్యం
కడప జిల్లా జమ్మలమడుగులో సుజాత అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సుజాత మోరగుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. సెలవుల విషయంలో డాక్టర్ తస్మయ, సుజాతకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. స్వీపర్ హాజరు పట్టికను జిరాక్స్ తీసేందుకు బయటకు తీసుకువెళ్లటంతో.. సుజాతను డాక్టర్ మందలించారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో మనస్థాపానికి గరైయిన సుజాత ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు ఆసుపత్రికి వచ్చి సిబ్బందిపై దాడి చేయటంతో.. డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రజాసంఘ నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.