ప్రకాశం జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వదిన, మరిది
Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వదిన, మరిది
Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైదాపురం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దారవీడు మండలం బద్దిడు గ్రామానికి చెందిన రాములమ్మ ,శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన వదిన, మరిది రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ జంట ఏమైనా ప్రేమించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే మరేమైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.