ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ హోరాహోరీ తలపడ్డాయి. అక్కడక్కడా జనసేన సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరులో గెలుపుపై టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ నుంచి బి.శ్రీనివాస్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్యే కనిపిస్తోంది. ఇక్కడినుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. లక్ష ఓట్ల మెజారిటీతో గల్లా జయదేవ్ విజయం సాధిస్తారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక గుంటూరు ఎంపీగా ఎవరు గెలుస్తారో వచ్చే నెల 23న తేలనుంది. అయితే మూడు పార్టీల్లో ఎవరు గెలుస్తారో పోల్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి.