Weather Report: పెరుగుతున్న చలి..తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్

Update: 2025-01-24 00:13 GMT

Weather Report: భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఉంది. దాని ప్రభావంతో లక్షద్వీప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రోజంతా వర్షాలు కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు మాత్రం నేడు వర్ష సూచన లేదు. శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వేగంగా వస్తూపోతుంటాయి. ఆగ్నేయ ఆసియా నుంచి భారీ మేఘాలు వస్తున్నా..అవి తెలుగు రాష్ట్రాలను చేరడానికి మరో రెండు రోజుల సమయం పట్టేలా కనిపిస్తోంది. అందువల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు.

గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 25కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 15కిలోమీటర్లు, తెలంగాణలో 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రయాణాలు చేసేవారికి వాతావరణం బాగుంటుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటివేళ తెలంగాణ, ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.

రాత్రివేళ మంచు ఎక్కువగా కురుస్తోంది. తేమ పగటివేళ తెలంగాణలో 40శాతం ఉండగా ఏపీలో 50శాతం వరకు ఉంటుంది. అయితే రాత్రివేళ తెలంగాణలో 95శాతం, ఏపీలో 99శాతం ఉంటుంది. అందువల్ల రాత్రివేళ చలి,మంచు సమస్య ఎక్కువగానే ఉంటుంది. 

Tags:    

Similar News