Badvel: కరోనా వైరస్ పై అవగాహనకు గోడ పత్రాలు విడుదల

పట్టణంలోని స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో మండల వైద్యాధికారి చంద్రహాస రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ కు సంభందించిన గోడ పత్రాలు విడుదల చేశారు.

Update: 2020-02-07 10:53 GMT

బద్వేల్ : పట్టణంలోని స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో మండల వైద్యాధికారి చంద్రహాస రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ కు సంభందించిన గోడ పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ మాట్లాడుతూ కరోనా వైరస్ పై వైద్య సిబ్భంది, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటరెడ్డి, మండలాల ప్రత్యేక అధికారులు సురేష్, మద్దిలేటి, బ్రహ్మానంద రెడ్డి, సుబ్బారావు, అట్లూరు, బి.కోడూరు తహశీల్దార్లు రాంభూపాల్ రెడ్డి, మధురవాణి,హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News