Vizag Shipyard Incident: షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

Vizag Shipyard Incident: ఏపీలోని విశాఖలో హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు.

Update: 2020-08-02 13:06 GMT
Vizag Shipyard Incident

Vizag Shipyard Incident: ఏపీలోని విశాఖలో హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. చనిపోయిన బాధిత కుటుంబాలు తమకి న్యాయం చేయాలనీ కోరుతూ ఆందోళనకి దిగడంతో మంత్రి అవంతీ శ్రీనివాస్ కంపెనీతో, బాధిత కుటుంబాలతో చర్చలు జరిపారు. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక దీనిపైన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "షిప్‌యార్డ్ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.. హిందూస్తాన్ షిప్‌యార్డ్ చరిత్రలో ఇదే తొలి దుర్ఘటన అని అయన విచారం వ్యక్తం చేశారు. ‌ఇక హిందూస్తాన్ కంపెనీ సీఎండీ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వెంకట్రావు, చైతన్య, రమణ, పి.వి. రత్నం, పి నాగ దేవుళ్ళు, సత్తిరాజు, శివ కుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పి భాస్కర్ లుగా గుర్తించారు.

ఇక విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డు ప్రమాదంపై విచార‌ణ‌కు రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్ ప్రక‌టించారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో ఒక‌టి, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి మ‌రో కమిటీ వేస్తున్నట్టు అయన తెలిపారు.. ఇందుకు సంబంధించి హెచ్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌తో ఇప్ప‌టికే చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. 

Tags:    

Similar News