ఎల్జీ పాలిమర్స్ సీజ్!

Update: 2020-05-26 07:01 GMT

విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థ ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు నిర్దేశించింది.

అంతేగాక ఎల్జీ పాలిమర్స్‌ ప్రాంగణంలోకి సంస్థ డైరెక్టర్లతో పాటు ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేసింది. దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న కమిటీలు.. అవసరమైతే పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని, అయితే ఆ కమిటీల సభ్యులు తిరిగి వెళ్లేటప్పుడు సంస్థ గేటు వద్ద ఉన్న రిజిస్టర్‌లో.. తనిఖీకి సంబంధించిన విషయాన్ని, పరిశీలించిన అంశాన్ని రికార్డు చేయాలని పేర్కొంది. కోర్టు అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ చర, స్థిరాస్తులు.. అమర్చి ఉన్న సామగ్రి, యంత్రాలు మొదలైన వేటినీ తరలించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన పరిశ్రమను సీజ్ చేసేసింది. 


Tags:    

Similar News