Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరో భారీ ఉద్యమానికి సిద్ధం

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరో భారీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.

Update: 2021-11-22 07:44 GMT

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరో భారీ ఉద్యమానికి సిద్ధం

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరో భారీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ రూపాలలో ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కేంద్రం మాత్రం దిగిరావడం లేదు. దీంతో రైతు ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో మరో పెద్ద ఆందోళన తో తమ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి కార్మికులు సిద్ధం అవుతున్నారు.

విశాఖ ఉక్కు ఉద్యమం కొన్ని నెలలుగా కొనసాగుతూ వస్తుంది. కార్మికులు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితిగా ఏర్పడి ప్రైవేటికరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కార్మికుల ఆందోళనకు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తో పాటు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కరోనాను సైతం లెక్కచేయకుండా కార్మికులు పోరాటం చేపట్టారు. అయినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణకు వ్యతిరేకంగా మరోసారి తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్న కార్మికులు ఈనెల 26 న వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం, తెలుగు తల్లి విగ్రహం, ఉక్కు నగరంతో పాటు పెద్దగంట్యాడ లో ఉన్న జనరల్ ఆసుపత్రి దగ్గర ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అయినా కేంద్రం దిగిరాకపోతే మరో మారు ఢిల్లీ వెళ్లి తమ గళం వినిపిస్తామంటున్నాయి కార్మిక సంఘాలు.

నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన రైతుల స్పూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి కార్మికులు సిద్ధం అవుతున్నారు. గత కొన్ని నెలలుగా కుటుంబాలను వదిలేసి చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో పోరాటం చేసిన రైతులు తమకు ఆదర్శమంటున్నారు కార్మికులు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వం అంటున్నారు పోరాట కమిటీ సభ్యులు. రైతు ఉద్య ఇచ్చిన స్పూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఎంతవరకు ముందుకువెళ్తుందో వేచి చూడాలి. 

Tags:    

Similar News