Visakhapatnam: పోలీసుల వాహనాన్ని ఎత్తుకెళ్లాడు..రోడ్డు మీద భారీ ఛేజింగ్...

Update: 2020-01-21 10:51 GMT
విశాఖ: పోలీసుల వాహనాన్ని ఎత్తుకెళ్లాడు..రోడ్డు మీద భారీ ఛేజింగ్...

విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోలీసు వాహనాన్ని అపహరించాడు. పాయకరావుపేట స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే మొబైల్‌ వాహనం డ్రైవర్‌ ఇంజిన్‌ ఆన్‌చేసి పెట్టి ఉంచడంతో గుర్తు తెలియని ఓ వ్యక్తి పోలీసు వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనతో అతడిని మానసిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని మతిస్థిమితం లేని వ్యక్తి తీసుకెళుతున్న సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News