Visakhapatnam: మహిళలకు సురక్షిత నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో

దేశవ్యాప్తంగా మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరాల జాబితాలో విశాఖపట్నం, కోహిమా, భువనేశ్వర్‌, ఆయిజోల్‌, గాంగ్‌టోక్‌, ఇటానగర్‌, ముంబయి అగ్రస్థానాల్లో నిలిచాయి.

Update: 2025-08-28 15:15 GMT

Visakhapatnam: మహిళలకు సురక్షిత నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో

దేశవ్యాప్తంగా మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరాల జాబితాలో విశాఖపట్నం, కోహిమా, భువనేశ్వర్‌, ఆయిజోల్‌, గాంగ్‌టోక్‌, ఇటానగర్‌, ముంబయి అగ్రస్థానాల్లో నిలిచాయి. మరోవైపు పట్నా, జైపూర్‌, ఫరీదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్‌, రాంచీ వంటి నగరాలు చివరలో నిలిచాయి. "మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక (NARI Index 2025)" లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక సిద్ధమైంది. దీనిలో జాతీయ భద్రతా స్కోరు 65%గా తేలింది.

కీలకాంశాలు:

కోహిమా, విశాఖపట్నం వంటి నగరాలు లింగ సమానత్వం, మహిళా అనుకూల మౌలిక సదుపాయాలు, పకడ్బందీ పోలీసింగ్‌, ప్రజల భాగస్వామ్యం వల్ల ముందున్నాయి.

దిల్లీ, కోల్‌కతాలో మాత్రం మౌలిక సదుపాయాల లోపం, పితృస్వామ్య దృక్పథం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయి.

60% మంది మహిళలు తమ నగరాల్లో భద్రంగా ఉన్నామని భావించగా, 40% మంది అంత సురక్షితంగా లేమని తెలిపారు.

రాత్రిపూట ప్రజారవాణా, వినోద ప్రదేశాల్లో భద్రత తక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

పని ప్రదేశాల్లో 91% మంది మహిళలు సురక్షితంగా ఉన్నామని చెబుతున్నా, POSH చట్టాల గురించి చాలా మందికి అవగాహన లేదని తేలింది.

భద్రతా ఫిర్యాదులను పరిష్కరించడంలో 25% మంది మాత్రమే అధికారులను నమ్ముతున్నారు.

2024లో 7% మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్నారని, 24 ఏళ్ల లోపు మహిళల్లో ఇది 14%గా నమోదైంది.

జాతీయ మహిళా కమిషన్‌ హెచ్చరిక

మహిళా విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాకపోకల విషయంలో భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగిందని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ తెలిపారు.

భౌతిక, మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రత కలగాలంటే అందరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. హెల్ప్‌లైన్‌ల వినియోగం, అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల నియామకం, స్మార్ట్ సిటీల్లో సీసీటీవీ వ్యవస్థలు, రైల్వే–బస్టాండ్‌లలో భద్రతా చర్యలను ఆమె అభినందించారు.

Tags:    

Similar News