Ramesh Babu: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రాజీనామా
Ramesh Babu: పార్టీ అభివృద్ధికి పనికొచ్చే పనులు సైతం చేయలేకపోయా
Ramesh Babu: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రాజీనామా
Ramesh Babu: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచర్ల రమేశ్ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నా... పార్టీ అభివృద్ధికి పనికొచ్చే పనులు సైతం చేయలేకపోయానంటూ పంచకర్ల రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను సైతం కలవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ వాపోయారు. వైసీపీ ఆహ్వానం మేరకే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చానని... విశాఖ జిల్లా అధ్యక్షుడిగా తనకు చేతనైనంత వరకు పని చేశానని పంచకర్ల రమేశ్ చెప్పారు.