Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..10 లక్షల గోవిందకోటి రాసినవారికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

Update: 2025-05-13 01:15 GMT

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..10 లక్షల గోవిందకోటి రాసినవారికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ లక్షల్లో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. అందులో చాలా మంది భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరాలని ఏడుకొండలవారికి మొక్కుతుంటారు. కోరికలు తీరిన అనంతరం మొక్కులు తీర్చుకుంటారు. అయితే నేటి యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యగా రామకోటి తరహాలో గోవింద కోటిని రెండేళ్ల క్రితం టీటీడీ ప్రవేశపెట్టింది. గోవిందకోటి రాసిన యువతకు వీఐసీ దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. 25ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్నవారు దీనికి అర్హులు. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐసీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

టీటీడీ తెలిపిన సమాచారం ప్రకారం కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్ లైన్ లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలు ఉండే పుస్తకంలో 39,600 నామాలు రాసుకోవచ్చు. 10,01,116 నామాలు పూర్తిచేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం ఉంటాయి. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంతని టీటీడీ అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసి తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తామని పేష్కార్ రామక్రిష్ణ తెలిపారు.

మొదటిసారిగా గోవిందకోటి నామాల పుస్తకాన్ని కర్నాటకకు చెందిన కీర్తన గతేడాది ఏప్రిల్ లో పూర్తి చేశారు. బెంగళూరులో ఇంటర్ పూర్తి చేసిన ఆమె 10, 01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకి సమర్పించారు. ఆ యువతికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. అనంతరం మరో ఇద్దరు కూడా గోవిందకోటి నామాలను రాసి వీఐసీ బ్రేక్ దర్శనం పొందారని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News