Vijaysai Reddy: లంచాలు తిని కంచాలు మోగించడం ఏంటి.. వైసీపీ అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు..
Vijaysai Reddy: టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
Vijaysai Reddy: లంచాలు తిని కంచాలు మోగించడం ఏంటి.. వైసీపీ అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు..
Vijaysai Reddy: టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు అని ఎద్దేవా చేశారు. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడని గుర్తు చేశారు. ఏ మొహం పెట్టుకొని ఈ ఆందోళనకు పిలుపునిచ్చారని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై, చట్టంపై నమ్మకం లేని అసాంఘిక శక్తులుగా టీడీపీ నేతలు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాలుగా లోకేష్ ఢిల్లీలో దాక్కున్నాడు. ఢిల్లీలో దాక్కున్న లోకేష్ ధైర్యవంతుడా... ఉత్తర కుమారుడా...? అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు.