కరోనా పై పోరాటం : బెజవాడ పోలీసుల ఫ్రెండ్లీ టచ్

కరోనా వైరస్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చ నడుస్తుంది. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

Update: 2020-03-28 07:49 GMT
Police Awareness on Coronavirus

కరోనా వైరస్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చ నడుస్తుంది. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు సంఖ్య అయిదు ల‌క్ష‌లకి దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైరస్ బారిన ప‌డి 22, 334 మంది మృతిచెందారు. 1, 21, 214 మంది కోలుకున్నారు. ఇక భారత్ లో కుడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 870 కి చేరుకోగా, 19 మంది మృతి చెందారు.

దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ప్రజలు కూడా తమకు సహరించాలని, ఇంట్లోనే ఉండాలని బయటకు రావొద్దు అని కోరుతున్నాయి. అయినప్పటీకి ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా బయటకు వచ్చి ఎప్పటి లాగే తిరిగడంతో కఠిన చర్యలను అవలంభిస్తున్నాయి.

ఇక పోలీసులు కూడా కొన్ని చోట్లల్లో పద్ధతిగా చెప్పగా,మరి కొన్ని చోట్ల దగ్గర తమ లాఠీలకు పనిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలసులు వైఖరిపై రాజకీయ నాయకుల నుంచి ప్రజల వరకు తీవ్ర విమర్శలు చేశారు. కొన్నిచోట్ల పోలీసులు అకారణంగానే అమాయకుల్ని కొట్టారనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గుర్ని సస్పెండ్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో విజయవాడ పోలీసులు వినూత్నమైన ఆలోచనను శ్రీకారం చుట్టారు.. కరోనా పై అవగాహన కల్పిస్తూ.. శనివారం ఉదయం పోలీసులు సిగ్నల్స్ దగ్గర రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు చేతులెత్తి నమస్కరి స్తూ.. దయచేసి రోడ్లపైకి రావొద్దంటూ దండం పెట్టారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే రోడ్లపైకి రావాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలకు మరింత అవగాహన కలిగేలా చేస్తున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కి చేరింది.



Tags:    

Similar News