Vijayawada Elections : ఉత్కంఠగా మారిన విజయవాడ ఎన్నికలు

Vijayawada Elections: గెలుపుపై అధికార, ప్రతిపక్షాల ధీమా

Update: 2021-03-04 06:51 GMT

విజయవాడ మున్సిపల్ ఆఫీస్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Vijayawada: విజయవాడ నగర మేయర్ పీఠం ఎవరి సొంతం కానుంది. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. గ్రేటర్ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలుపే లక్ష‌్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు పుట్టుకువస్తున్నారు. కానీ అధికార, ప్రతిపక్షాలు మేయర్‌ అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరీ విజయవాడ మేయర్‌ పీఠంపై కూర్చునెదెవరు.? లెట్స్ వాచ్‌ దిస్ స్టోరీ..

విజయవాడ నగర మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా ట్రే చేస్తున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ పరిధిలో 64 వార్డులు ఉన్నాయి. ఇక్కడ గెలిచి, అమరావతి ప్రభావం లేదని నిరూపించాలని వైసీపీ భావిస్తోంది. ఇటు టీడీపీ సైతం విజయవాడ పీఠం దక్కించుకోని వైసీపీ దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది.

పీఠం కోసం అధికార, ప్రతిపక్షాల పార్టీల మద్య విపరీతమైన పోటీ నడుస్తోంది. అదే స్థాయిలో మేయర్‌ రేసులో పేర్లు వినిపిస్తున్నాయి. మేయర్‌ సీటు జనరల్ మహిళకు డిసైడ్‌ అవ్వడంతో అగ్రవర్ణాల నేతలు పోటీకి సై అంటున్నారు.

మేయర్ పీఠం కోసం అధికార పార్టీ వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బండి పుణ్యశీల పేరు వినిపిస్తోంది. ఈమె కౌన్సిల్‌లో వైసీపీకి ఫ్లోర్ లీడర్‌గా కూడా వ్యవహరించారు. గత అనుభవం దృష్ట్యా ఆమెకే మేయర్ పదవి దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పార్టీని నమ్ముకున్న వారిని వైఎస్‌ జగన్‌ ఎప్పుడు మోసం చేయరంటూ ఆమె తన అభిప్రాయాన్ని వెల్లగక్కారు.

మరోవైపు వైసీపీలో పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత రెడ్డి సైతం మేయర్ రేస్‌లో ఉన్నారు. గౌతమ్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటారు. లిఖితారెడ్డికి మేయర్‌ పదవీ కట్టబెట్టే అవకాశముందని వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది.

ఇటు టీడీపీ సైతం మేయర్‌ పదవీ తమకే అని దీమాగా ఉంది. కానీ మేయర్‌ అభ్యర్థి విషయంలో టీడీపీలో అంతర్గత వివాదాలు చుట్టుముట్టాయి. మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు బలంగా వినిపిస్తోంది. అయితే క్షత్రియ సామాజికవర్గం నేతలు సంధిరెడ్డి గాయత్రికి సపోర్ట్ చేస్తునట్టు తెలుస్తోంది. కేశినేని నానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా బహిరంగ విమర్శలకు దిగారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే.. మళ్లీ మేయర్ పదవీ అదే సామాజికవర్గానికి చెందిన శ్వేతకి ఎలా కట్టబెడతారని కొందరు నేతలు కొత్త పాయింట్‌ లేవనెత్తారు.

బోండా ఉమా మాత్రం సందిరెడ్డి గాయత్రికి సపోర్టు చేస్తున్నారు. విజయవాడ మూడు నియోజకవర్గాల పరిధిలో సెంట్రల్‌ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అందుకే ఈ నియోజకవర్గానికి చెందిన గాయత్రికి అవకాశం ఇవ్వాలని బోండా ఉమా భావిస్తున్నారు.

ఏదేమైనా మేయర్ పీఠం పోటీ ఉత్కంఠగా మారింది. ఆశావహులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఆఖరి నిమిషంలో పార్టీలో వివిధ ఒత్తిళ్లు, అప్పటి పరిస్థితులనుబట్టి పార్టీ మరెవరినైనా మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు.

Tags:    

Similar News