మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన విజయసాయిరెడ్డి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు.

Update: 2019-12-11 04:19 GMT
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎంపీ విజయసాయిరెడ్డి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ప్రణబ్ జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలోని ప్రణబ్ ఆఫీసుకు వెళ్లిన విజయసాయి.. ప్రణబ్ ముఖర్జీని సన్మానించారు. దేశానికీ ప్రణబ్ చేసిన సేవలను కొనియాడారు. ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షించారు విజయసాయి.

ఈ సందర్బంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులపై ప్రణబ్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాగా భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించారు ప్రణబ్. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకునిగా ఉన్నారు.

కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించారాయన. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు ప్రణబ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ప్రణబ్‌ ను అభిమానిస్తారు. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని చెబుతుంటారు. 1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌.. నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు అత్యంత సన్నిహితుడు.అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా ప్రణబ్ తో సంప్రదిస్తుంది. రాష్ట్రపతి పదవి ముగిసిన తరువాత ఆయన ప్రశాంతమైన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.

Tags:    

Similar News