ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: ఇచ్చిన వాగ్దానాన్ని బీజేపీ మర్చిపోయిందని ఆగ్రహం

Jyothi
Published on: 7 Feb 2023 7:45 PM IST
Vijayasai Reddy Criticized the Center for Special Status to AP
X

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ విజయసాయిరెడ్డి 

Vijayasai Reddy: రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్న విజయసాయిరెడ్డి...ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిదని విమర్శించారు. పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని..అందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పార్టీలు వస్తుంటాయి..పోతుంటాయి..కానీ ప్రభుత్వం అనేది కొనసాగింపు అని..ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. ఇప్పటికైనా ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story