Vijayasai Reddy: జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ !
Vijayasai Reddy: జగన్‌కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayasai Reddy: జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ !
Vijayasai Reddy: జగన్‌కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్నారు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదిలేసుకున్నానంటూ వివరణ ఇచ్చారు.
విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంపై గురువారం స్పందించిన జగన్.. సాయిరెడ్డి కావచ్చు వెళ్లిపోయిన వాళ్లు కావచ్చు, వెళ్లబోయే వాళ్లు కావచ్చు.. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. అయితే దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి తనకు క్యారెక్టర్ ఉందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం చర్చనీయాంశమైవుతోంది.