లోకేశ్ ఆస్తుల ప్రకటనపై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Update: 2020-02-21 06:55 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబ ఆస్తులను గురువారం రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైసీీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్వీటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. 'తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ' అంటూ ట్వీట్ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటించారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తన తల్లి నారా భువనేశ్వరి 23 ఏళ్లుగా హెరిటేజ్‌లో పని చేస్తున్నారని, కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసమే దీనిని స్థాపించామని లోకేష్ అన్నారు. దీనిద్వారా నేరుగా 3 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు కాగా అందులో అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని లోకేశ్ వెల్లడించారు.

అయితే ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే అంతా బయటకు వస్తుందని ఆయన పేపర్లు భద్రంగా దాచుకో అనడంపై రాజకీయా వర్గల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. 




  

Tags:    

Similar News