Vidadala Rajini: అల్ట్రాసౌండ్ టిఫా స్కాన్స్ ప్రతి గర్భిణీకి ఉపయోగపడుతుంది..
Vidadala Rajini: ఆరోగ్యశ్రీలోకి అల్ట్రాసౌండ్ టిఫా స్కాన్స్ తేవడం సంతోషం
Vidadala Rajini: అల్ట్రాసౌండ్ టిఫా స్కాన్స్ ప్రతి గర్భిణీకి ఉపయోగపడుతుంది.
Vidadala Rajini: గుంటూరు లో ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చిన ఆల్ట్రాసౌండ్, టిఫా స్కాన్స్ ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. ఆల్ట్రాసౌండ్, టిఫా స్కాన్స్ ప్రతి గర్భిణీ మహిళకు ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. బయట ప్రేవేట్ గా చేయించుకునే ఈ ఆల్ట్రాసౌండ్, టిఫా స్కాన్స్ ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించుకొవచ్చన్నారు. ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి మంచి విజన్ తో ముందుకు వెళ్తున్నారన్నారు. గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి ఏనాడు వైద్యం గురించి ఆలోచించిన దాఖలాలు లేవని రజని విమర్శించారు. 500 కోట్ల రూపాయలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి జగనన్న కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు.