టీడీపీ ఎమ్మెల్యేకు ఉపరాష్ట్రపతి ఫోన్

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Update: 2020-04-30 04:51 GMT
vice president venkaiah naidu(File photo)

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఆరా తీశారని, అలాగే రాజమండ్రిలో ఏన్ని కేసులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారని గోరంట్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో స్వచ్చందంగా పేద కార్మిక వర్గాలకి సాయం అందించడాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి కొన్ని విషయాలను తీసుకువచ్చారు.

ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. నిన్న ఒక్కరోజే 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కి చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి. ఇక 287 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు. గత నాలుగు రోజులుగా ఒకరు కూడా మరణించలేదు. ప్రస్తుతం 1014 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కేసులు, గుంటూరు 283, కృష్ణా జిల్లాలో 236 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం 23, అనంతపురం 58, చిత్తూరు 77, నెల్లూరు 82, కడప 69, ప్రకాశం 60, తూర్పుగోదావరి 40, పశ్చిమగోదావరి 56, శ్రీకాకుళం 5, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.



 


Tags:    

Similar News