తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంకట అప్పలనాయుడు
* ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం-ఎస్పీ వెంకట అప్పలనాయుడు * చట్టం పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత కల్గిస్తా-ఎస్పీ
Venkata Appalanayudu (file image)
తిరుపతి అర్బన్ నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు వెంకట అప్పలనాయుడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చట్టం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా తన పనితీరు ఉంటుందన్నారు. ట్రైనీగా, చిత్తూరు ఎస్పీగా పని చేసిన తనకు తిరుపతిపై అవగాహన ఉండటంతో.. కార్యచరణ ఈజీగా ఉంటుందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం తన విధుల్లో ప్రధాన భాగమన్నారు ఎస్పీ వెంకట అప్పలనాయుడు.