Andhra Pradesh: అరెస్టులతో అడ్డుకోలేరు: వరప్రకాష్

అరెస్టులతో ఉద్యమాలను ఎవ్వరూ ఆపలేరని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వి సాయి కుమార్ బాబులు పేర్కొన్నారు.

Update: 2020-01-20 11:09 GMT

మండపేట: అరెస్టులతో ఉద్యమాలను ఎవ్వరూ ఆపలేరని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వి సాయి కుమార్ బాబులు పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేసారు.రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం కీలకబిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా టీడీపీ నాయకులు అసెంబ్లీని ముట్టడిస్తారనే సమాచారంపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తేదేపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సాయి కుమార్ బాబులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.

ఇంటి నుండి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. దీంతో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయిన వారి ఇళ్ళకు వెళ్ళి సంఘీభావం గా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తుందన్నారు. ఓ పక్క తమది రైతుల పక్షపాతి పార్టీ అని డప్పులు కొట్టుకుంటూనే మరోవైపు రైతుల ఉద్యమాన్ని అడ్డుకోవడం తగదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము అన్ని విధాలా మద్దతునిస్తామని, అయితే పరిపాలన వికేంద్రీకరణను మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్ నిర్ణయం కారణంగా ఏదైనా ఒక పని పడితే ప్రజలు రాష్ట్రమంతటా తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దుయ్యబట్టారు. తమను ఎన్ని అరెస్టు చేసినా ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని ప్రకాష్ స్పష్టం చేసారు. వీరి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News