Vangaveeti Radha: వైసీపీలోకి వంగవీటి రాధా రీ ఎంట్రీ..!
Vangaveeti Radha: వైసీపీలోకి రావాలని ఇప్పటికే రాధాను ఆహ్వానించిన ఎంపీ మిథున్‌రెడ్డి
Vangaveeti Radha: వైసీపీలోకి వంగవీటి రాధా రీ ఎంట్రీ..!
Vangaveeti Radha: వైసీపీలోకి వంగవీటి రాధా రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ.. రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాధాతో మాజీమంత్రులు పేర్ని నాని, కొడాలి నాని భేటీ.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెండు రోజుల్లో సీఎం జగన్‌ను వంగవీటి రాధా కలవనున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే.. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రాధా దిగుతారనే చర్చ నడుస్తోంది. వైసీపీలోకి రావాలని ఇప్పటికే రాధాను వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆహ్వానించారు. మొన్న కుప్పం సభలో వంగవీటి రంగా పేరును సీఎం జగన్ ప్రస్తావించారు. దీంతో.. వైసీపీలోకి వంగవీటి రాధా రీ ఎంట్రీ దాదాపు కన్ఫామ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.