Tirupati: శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి.. పుట్టిన దూడలను పరామర్శించిన జవహార్ రెడ్డి
Tirupati: టీటీడీ చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది -జవహార్ రెడ్డి
Tirupati: శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి.. పుట్టిన దూడలను పరామర్శించిన జవహార్ రెడ్డి
Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రయత్నం సత్ఫలితాలిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యార్శి జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.గతంలో తాను తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన సమయంలో దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రాజెక్టుకు రూపకల్పచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి గోసంరక్షణశాలలో ఆరు ఆవులు దూడలకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకున్న జవహార్ రెడ్డి... ఆవుదూడలను పరామర్శించారు. దేశవాళీ గోజాతులను అభివృద్ధి ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తుండటం ఆనందంగా ఉందని జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
దేశీయ గోజాతి పశువులను అభివృద్ధి చేయడంతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నిత్యసేవల్లో వినియోగించేందుకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఆరు ఆవులు మేలు జాతి దూడలకు జన్మనిచ్చాయి. మరి కొన్ని రోజుల్లో 13 ఆవులు దూడలకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.