పెద్ద పల్లకిలొ ఉపమాక వెంకన్న తిరువీధి సేవ

నక్కపల్లి మండలంలోని ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు లో భాగంగా మంగళవారం స్వామిని పెద్ద పల్లకీలో తిరువీధి సేవ నిర్వహించారు.

Update: 2019-12-25 06:38 GMT

పాయకరావుపేట : నక్కపల్లి మండలంలోని ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు లో భాగంగా మంగళవారం స్వామిని పెద్ద పల్లకీలో తిరువీధి సేవ నిర్వహించారు. గోదాదేవి అమ్మవారి వ్రత దీక్షలో భాగంగా తొమ్మిదవరోజు తూమణి మాడత్తు శుత్తుం విలక్కడియేన్ పాశురంతో స్వామి వారికి ఆండాళ్ అమ్మవారికి ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

ఉదయం ఆలయంలో నిత్య కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులు పెద్దపల్లకీలోను, ఆండాళ్ అమ్మవారిని చిన్నపల్లకీలోను వేంచేపుచేసి తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శేషాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, సూపరింటెండెంట్ ఎన్ హరిబాబు, సిబ్బంది బాలాజీ, రాజశేఖర్ , గ్రామానికి చెందిన నున్న సుభాష్ పలువురు భక్తులు పాల్గొన్నారు.సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేత.

గురువారం ఉదయం ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా బుధవారం ఆలయంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసి రాత్రి గం.7-30నిలకు ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుందని ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు. తిరిగి గురువారం మధ్యాహ్నం గం .12-00నిలకు దేవాలయం తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తిరుమంజనాలు, ఆరాధనలు , నిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సూర్యగ్రహణం కారణంగా ధనుర్మాసోత్సవాలు లలో భాగంగా నిర్వహించే స్వామి వారి ,అమ్మవారి తిరువీధి సేవలు గురువారం రద్దుచేయడం జరిగిందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News