Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు,ఏపీలో మరో పది రోజులు

Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాలవార్షల ముప్పు పొంచి ఉంది.

Update: 2021-04-15 04:18 GMT

Thunderstorm(File Photo)

Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాలవార్షల ముప్పు పొంచి ఉంది. రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఎక్కువగా పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. దాంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

రాయలసీమతో పాటు గుంటూరు, గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడతాయని.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతోపాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.

జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంది. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్షసూచన ఉందన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు.

తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రటించారు.అయితే బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. లేపక్షిలోని కల్లూరులో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుతో భారీ వర్షం గురిసింది. 

Tags:    

Similar News