తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Tirumala: దర్శనానంతరం ఆశీర్వచనం అందించిన వేదపండితులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Tirumala: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయం వద్ద చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి ..శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు.