Nitin Gadkari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు
Nitin Gadkari: ప్రజాసేవ చేసే శక్తిని ప్రసాదించమని వేడుకున్నా
Nitin Gadkari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు
Nitin Gadkari: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన, ఈ తెల్లవారుజామున తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో గడ్కరీ దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పట్టువస్త్రం కప్పి, తీర్ధప్రసాదాలను అందజేసారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించమని వెంకటేశ్వర స్వామివారికి ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు.