Dwaraka Tirumala: ద్వారకా తిరుమల హుండీకి భారీగా రూ.2వేల నోట్లు

Dwaraka Tirumala: తాజాగా 388 నోట్లు వచ్చినట్లు గుర్తించిన అధికారులు

Update: 2023-06-01 11:50 GMT

Dwaraka Tirumala: ద్వారకా తిరుమల హుండీకి భారీగా రూ.2వేల నోట్లు 

Dwaraka Tirumala: రెండు వేల నోట్లను కేంద్ర వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగానే వాటిని మార్చకునేందుకు ప్రజలు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ద్వారకా తిరుమల హుండీకి రెండు వేల నోట్లు పెరిగాయి. 15 రోజులకు ఓసారి హుండీ లెక్కింపు జరుగుతోంది. తాజాగా జరిగిన హుండీ లెక్కింపుల్లో 388 రెండు వేల నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2 వేల నోట్లు కేవలం హుండీకి మాత్రమే పరిమితం కాలేదు. 2 వేల నోట్లతో భక్తులు పెద్ద ఎత్తున ప్రసాదాలు సైతం కొనుగోలు చేస్తున్నట్లు అధికారలు వెల్లడించారు. అయితే రద్దయిన 5 వందలు, వేయి నోట్లు సైతం ఇంకా హుండీల్లో కట్టలుగా పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News