రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
Two teenagers were killed: కారు రోడ్డు పక్కన ఉన్న జీడిచెట్టును ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Two teenagers were killed and one man was seriously injured
Andhra Pradesh| కారు రోడ్డు పక్కన ఉన్న జీడిచెట్టును ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నాతవరం మండలం నాతవరంనకు చెందిన ఆశపు శ్రీనివాసు (30), ఆశపు హనుమంతు సాయి (25)లతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ తో కలిసి డ్రైవింగ్ నేర్చుకో్వాలనే ఉద్దేశ్యంతో బుధవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరారు.
ఈ క్రమంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో తాండవ జంక్షన్ నుంచి నాతవరం వైపు వెళ్లే రహదారిలో అగ్రహారం వద్ద రోడ్డుకు సమీపంలో ఉన్న జీడిచెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆశపు శ్రీనివాసు, హనుమంతుసాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ శ్రీనివాస్ కు బలమైన గాయాలయ్యాయి. గురువారం ఉదయమే వాకింగ్ కు వచ్చే వారు మృతులను గుర్తించి, పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన డ్రైవర్ శ్రీనివాస్ ను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మృత దేహాలను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆశపు శ్రీనివాసు, హనుమంతుసాయిలు అన్నదమ్ములు కావడం, ఒకే ఇంటిలో ఇద్దరు మరణించడంతో నాతవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.