తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్

Update: 2020-11-20 10:18 GMT

తుంగభద్ర పుష్కరాలను సీఎం జగన్‌ ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సీఎం జగన్‌ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ ఉన్నారు.

Tags:    

Similar News