ఉల్లి కోసం పోటెత్తిన ప్రజలు

బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు పోటెత్తారు.

Update: 2019-12-19 09:48 GMT

తుని: బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు పోటెత్తారు. తుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలను పంపిణీ చేస్తున్నారు. ఉల్లిపాయలు మార్కెట్ యార్డుకు వచ్చాయని తెలియడంతో గురువారం ఉదయం నుంచే మహిళలు పురుషులనే తేడా లేకుండా ఉల్లి కోసం బారులు తీరారు. రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసుకొని ఇరవై ఐదు రూపాయ లకే కిలో ఉల్లిపాయలు అందజేస్తున్నారు.

మార్కెట్ యార్డ్ అధికారులు సబ్సిడీ ఉల్లి పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మార్కెట్ యార్డ్ కు రెండు టన్నుల ఉల్లిపాయలు రావడంతో ఉల్లి పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు 100 నుంచి 150 రూపాయల వరకు ఉండడంతో ప్రభుత్వం 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలను పంపిణీ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి కోసం పోటెత్తిన ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా మార్కెట్ యార్డ్ అధికారులు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు.

Tags:    

Similar News