తుని వృద్ధుడి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు, కుటుంబ సభ్యుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన వృద్ధుడి సూసైడ్ కేసు కాకినాడ జిల్లా తునిలో నారాయణరావు అనే 63ఏళ్ల వృద్ధుడు.. మైనర్ బాలికతో ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో అరెస్ట్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు
తుని వృద్ధుడి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు, కుటుంబ సభ్యుల ఆందోళన
మైనర్ బాలికతో వికృత చేష్టలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వృద్ధుడి స్టోరీ పూటకో మలుపు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన వృద్ధుడి సూసైడ్ కేసులో అనేక అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు తెరపైకి వస్తున్నాయి. కాకినాడ జిల్లా తునిలో నారాయణరావు అనే 63 ఏళ్ల వృద్ధుడు.. మైనర్ బాలికతో ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదని ఆరోపించారు.
మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గందరగోళ పరిస్థితుల్లో పోలీసులు అక్కడ నుంచి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాత్రి పదిన్నర గంటలకు సంతకం కోసం వచ్చి ఇప్పుడు చనిపోయాడు అంటున్నారని.. తమ తండ్రి దుర్మార్గుడే కావచ్చు కానీ మీరు చేసింది ఏమిటని.. పోలీసుల్ని నారాయణరావు బంధువులు నిలదీశారు.