Tirumala: తిరుమలలో సంప్రదాయ భోజనం నిలిపివేత

Tirumala: సంప్రదాయ భోజనంపై తొలుత ప్రశంసలు

Update: 2021-09-02 04:21 GMT

సాంప్రదాయ భోజనం నిలిపివేయడం పై స్పందించిన వైవీ సుబ్బా రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Tirumala: తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనం కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ.. కొండపై స్వయంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఓ కార్యక్రమానికి డబ్బులు వసూలు చేయడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అవసరమైతే నష్టాన్ని భరించి భక్తులకు సంప్రదాయ భోజనాన్ని పెట్టాలని, అంతేతప్ప ఇలా డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో 14 రకాలు వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సంప్రదాయ భోజనంపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికారులతో చర్చించామని.. పాలకమండలి లేనపుడు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 

Tags:    

Similar News