Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..తిరుమల వెళ్తున్నట్లయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నిన్న మొన్నటి వరకు తిరుమలలో పులుల భయం ఉండేది. కానీ ఇప్పుడు ఏనుగుకూడా భయపెడుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులోని ఏడోవ మైలు దగ్గర ఏనుగుల గుంపు బీభత్సం స్రుష్టిస్తున్నాయి. దీంతో సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల ఫారెస్ట్ సిబ్బంది వాటిని ఘాట్ రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుని వాటిని పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్లేలా బెదరగొడుతున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులు అలర్ట్ గా ఉండాలని టీటీడీ ప్రకటించింది. తిరుమల చుట్టూ శేషాచలం అడవి ప్రాంతం ఉండటంతో అక్కడ ఉండే పులులు, ఏనుగులు తరుచూ ఘాట్ రోడ్డులో సంచరించడం చూశాము. తాజాగా గురువారం రాత్రి ఓ ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు దగ్గర బీభత్సం చేశాయి. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులుత ెలిపారు. ఏనుగుల మంద అలజడి చేసే ప్రమాదం ఉండటంతో ఒంటరి, రాత్రి వేళల్లో కొండపైకి రాకూదని సూచిస్తున్నారు.