తిరుమలలో గదుల అద్దెలు పెరిగాయ్... ఇవే కొత్త ధరలు..
Tirupati: పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న టీటీడీ
Tirupati: తిరుమలలో ఏసీ గదుల ధరల పెంపు
Tirupati: తిరుమలలో ఏసీ గదుల ధరలను టీటీడీ పెంచింది. నారాయణగిరి రెస్ట్ హౌస్ 1, 2, 3 లోని గదులను ఏసీ గదులుగా మార్చింది. 150 రూపాయలు ఉన్న వాటిని ఏసీ గదులుగా మార్చింది. ఒక్కో గదిని జీఎస్టీతో కలిపి 1,700 రూపాయలకు పెంచింది. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4లో ఒక్కో గది 750 రూపాయల నుంచి జీఎస్టీతో కలిపి 1700 రూపాయలకు పెంచింది టీటీడీ... నారాయణగిరిలో కార్నర్ షూట్‌లో జీఎస్టీతో కలిపి 2 వేల 200 రూపాయల ధర నిర్ణయించింది. స్పెషల్ టైప్ కాటేజెస్‌లో 750 రూపాయలు ఉన్న గదిని జీఎస్టీతో కలిపి 2 వేల 200 రూపాయలకు టీటీడీ పెంచింది. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి టీటీడీ అమలు చేస్తోంది.