TTD: దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ నయా ప్లాన్

TTD: తిరుమలలో గదులు పొందే విధానం సులభతరం

Update: 2023-02-15 04:15 GMT

TTD: దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ నయా ప్లాన్ 

TTD: వెంకన్న భక్తులకు టీటీడీ మెరుగైన సేవలను అందించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తోంది. ప్రతిరోజు వేల మంది భక్తులు వసతికోసం బుక్ చేసుకునే గదులకు సర్వీసు ఛార్జీలు, కాషన్ డిపాజిట్ చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.టీటీడీ తిరుమలలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేసింది. యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నారు.

గదులను పొందే సమయంలో గదుల అద్దెతో పాటుగా కాషన్ డిపాజిట్ సైతం చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. భక్తులు గదులు కాళీ చేసే సమయంలో ఈ ఓటీపీ చెప్పడం ద్వారానే కాషన్ డిపాజిట్ నగదు వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు.

తిరుమలలో రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదులు పొందే సమయంలో అదనంగా 500 రూపాయలను కాషన్ డిపాజిట్ కింద చెల్లించాలి. గదిని పొందే సమయంలో భక్తుడి సెల్ నంబరుకు టీటీడీ నుంచి ఓటీపీ వస్తుంది. గది ఖాళీ చేసే సమయంలో ఆ ఓటీపీని తెలియజేస్తే డిపాజిట్ రిఫండ్ అవుతుంది.

గదులను ఖాళీ చేసే సమయంలో భక్తుల సెల్ పోన్ కి వచ్చిన ఓటీపీని తెలుసుకుని దళారులు ఆ డిపాజిట్ సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇంకొందరు భక్తులు ఓటీపీ తెలియజేయకుండా వెళ్లిపోయి డిపాజిట్ రాలేదంటూ వాపోతున్నారు. వీటన్నిటికి చెక్ పెట్టేలా కొత్తగా ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా వారం పాటు పరిశీలించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News