తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ క్లారిటీ

కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది.. అందులో భాగంగా జనసమూహం ఎక్కువగా ఉండే ఆలయాలను సైతం మూసివేశారు.

Update: 2020-04-14 14:44 GMT
TTD (file photo)

కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది.. అందులో భాగంగా జనసమూహం ఎక్కువగా ఉండే ఆలయాలను సైతం మూసివేశారు. అందులో భాగంగానే ఏపీలోనని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు రద్దు చేశారు. అయినప్పటికీ స్వామివారికీ జరగాల్సిన పూజలు అన్ని జరుగుతున్నాయి. అయితే దర్శనానికి సంబంధించి టీటీడీ క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెల మూడు వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

దీనికి సంబంధించి ఓ ప్రకటనని విడుదల చేసింది టీటీడీ.. దర్శనం మరోసారి వాయిదా పడడంతో భక్తులు నిరాశతో ఉన్నారు. ఇక మొదటి విడత లాక్ డౌన్ నిర్ణయం తరువాత తిరుమల ఘాట్ రోడ్లను కూడా మూసేసి వేయడంతో ఎప్పుడు భక్తులతో కళకళలాడే తిరుమల బోసిపోయింది. ఇక శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని టీటీడీ పేర్కొంది. 

Tags:    

Similar News