TTD EO Dharma Reddy: టీటీడీ వంటశాలల్లో.. ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాల్లోనూ సిలిండర్లను తొలగిస్తాం
TTD EO Dharma Reddy: ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
TTD EO Dharma Reddy: టీటీడీ వంటశాలల్లో.. ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాల్లోనూ సిలిండర్లను తొలగిస్తాం
TTD EO Dharma Reddy: తిరుమలలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, టీటీడీ వంటశాలల్లో LPG సిలిండర్లను తొలగించి.. వాటి స్థానంలో LNG పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రానున్న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో వెల్లడించారు. దీంతో తిరుమలలో పూర్తిగా అగ్నిప్రమాదాలు నివారించవచ్చన్నారు.