TTD: రూ.3,500 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న బోర్డు
TTD: 69 అంశాలపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి
TTD: రూ.3,500 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న బోర్డు
TTD: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు. పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, సలహాదారులు బడ్జెట్ ముసాయిదాపై చర్చిస్తున్నారు. 3 వేల 500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ధార్మిక సేవల విస్తరణ, వివిధ ప్రాంతాల్లో దేవస్థానం తలపెట్టిన ఆలయ నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులపై చర్చించనున్నారు. TTD ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన పలు కొనుగోళ్లపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది.